టిక్‌టాక్ కోసం కుక్కపై దారుణం..వీళ్లను పట్టిస్తే రూ. 50 వేలు.. - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ కోసం కుక్కపై దారుణం..వీళ్లను పట్టిస్తే రూ. 50 వేలు..

May 25, 2020

TikTok

దేశంలో టిక్ టాక్ పై వ్యతిరేకత మొదలైంది. టిక్ టాక్ వీడియోలను అడ్డం పెట్టుకుని కొందరు మతపరమైన విద్వేషాలను, జంతు హింసను, అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ అప్లికేషన్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా టిక్‌టాక్‌లో వెలుగు చూసిన ఓ వీడియో ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఆ వీడియోలో ఇద్దరు యువకులు ఒక కుక్క కాళ్ల కట్టేసి చెరువులో విసిరేశారు. అంతే కాకుండా కుక్కు పైకి లేవకుండా దానిపై రాళ్లు విసిరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువకుల్ని పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించింది. వారి వివరాలు తెలిసిన వాళ్ళు ’91 9820122602′ మొబైల్ నంబర్ కు లేదంటే e-mail [email protected] లకు నేరుగా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొంది.