‘ఆర్ఆర్ఆర్’ సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్

March 8, 2022

18

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ వేశామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేత తమను సభ నుంచి సస్పెండ్ చేశారో చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శిని వివరణ కోరామన్నారు. దీనికి, నాలుగు రోజుల్లోగా సమాధానం ఇస్తానని అసెంబ్లీ కార్యదర్శి చెప్పినట్టు రఘునందన్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ అంశాన్ని అంత ఈజీగా వదలమని తేల్చి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తున్నట్టు తెలియజేశారు. కాగా, సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నేతలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.