యుద్ధం ఆమె మాత్రమే ఆపగలుగుతుంది.. 50 వేల మంది పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం ఆమె మాత్రమే ఆపగలుగుతుంది.. 50 వేల మంది పిటిషన్

March 22, 2022

pu

స్విట్జర్లాండ్‌లో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ వరల్డ్ ఛాంపియన్ అలీనా కబయేవాను దేశ బహిష్కరణ చేయాలంటూ స్విస్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. 38 ఏళ్ల అలీనా స్విట్జర్లాండ్‌లో ఓ ఖరీదైన విల్లాలో భారీ భద్రత మధ్య తన పిల్లలతో కలిసి ఉంటోందని ఆ దేశంలో చాలా మంది భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందే పుతిన్ అలీనాను దేశం దాటించినట్టు వివిధ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటే అలీనా వల్లనే అవుతుందనీ, ఆమె చెబితే పుతిన్ వింటాడు కాబట్టి ఆమెను తిరిగి రష్యాకు పంపించేయాలని రష్యా, ఉక్రెయిన్, బెలారస్ దేశాలకు చెందిన పౌరులు భావిస్తున్నారు. ఇందుకోసం వారు చేంజ్ డాట్ ఆర్గ్ వైబ్ సైట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌కు మద్ధతు తెలుపుతూ ఇప్పటివరకు 50 వేల మంది సంతకాలు చేశారు. కాగా, అలీనా పుతిన్‌కు మూడో ప్రేయసిగా పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.

001