తెలంగాణలో పెట్రోల్, డీజిల్ మోత.. ఏకంగా.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ మోత.. ఏకంగా..

April 4, 2022

13

దేశ వ్యాప్తంగా కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వంటనూనె ధరలు, గ్యాస్ ధరలు, టెబ్లెట్స్ ధరలు పెరగడంతో సామాన్యులు అనేక అవస్థలు పడుతున్నారు. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా 40 పైసలు వడ్డించాయి.

దీంతో గత 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి. మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.44, డీజిల్‌పై రూ.9.10 పెరిగింది. తాజా పెంపుతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.103.81, డీజిల్‌ రూ.95.07కు చేరింది. ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్‌పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది. ఇక, హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 45 పైసలు‌, డీజిల్‌పై 43 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ.117.68కి, డీజిల్‌ రూ.103.75కి చేరింది.