ఈ నెల 13న పెట్రోల్ బంకులు బంద్

కమీషన్ పెంపు, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వంటి డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులను ఈ నెల 13వ తేదీని మూసేయనున్నారు. తమ డిమాండ్లపై కేంద్ర సర్కారు స్పందించనందుకు నిరసననా బంద్ చేస్తున్నట్లు యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్‌(యూపీఎఫ్‌) ఓ ప్రకటనలో తెలిపింది. తమ న్యాయమైన డిమాండ్లను వీలైనంత తర్వగా పరిష్కరించాలని కోరింది. లేకపోతే ఈ నెల  27 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల క్రయవిక్రయాలను నిలిపేసి, నిరవధిక బంద్‌కు దిగుతామని హెచ్చరించింది. తక్కువ కమీషన్ల వల్ల బంకుల నిర్వహణ భారంగా మారిందని, ఎన్నిసార్లు డిమాండ్ చేసిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆలిండియా పెట్రోలియం డీలర్లు, డీలర్ల అసోసియేషన్‌, కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ పెట్రోలియం డీలర్లు మండిపడ్డారు. ‘ప్రతి ఆరు నెలలకు డీలర్ల మార్జిన్లను సవరించాలలి. పెట్టుబడులపై మెరుగైన ప్రతిఫలాలు రావాలి’ అని అన్నారు.  

SHARE