రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశంలోని చమురు కంపెనీలు కూడా ధరలు పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 109.10కి, డీజిల్ ధర రూ. 95.49కి చేరింది. ఏపీలో పెట్రోల్ ధర 88 పైసలు, డీజిల్ 83 పైసలు పెరిగింది. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.80, డీజిల్ రూ. 96.83కి చేరింది. మరోవైపు గృహ, కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. 14.20 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరపై రూ. 50 పెరిగింది. దాంతో తెలంగాణలో సిలిండర్ ధర రూ. 1002కి చేరింది. ఏపీలో రూ. 1008 గా ఉంది. ఇక 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2033.50 కి పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి. కాగా, దాదాపు ఐదు నెలల తర్వాత వీటి ధరలు పెరగడం గమనార్హం.