మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషిని విడుదల చేయడం అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా అని అన్నారు. దేశానికి ఈరోజు అత్యంత విషాదకర దినమని చెప్పారు. కేంద్రంలోని మోడీ సర్కార్ చిల్లర రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఓ హంతకుడి విడుదల కోసం కోర్టులో ఓ విధమైన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందన్నారు.
ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేయడం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే కాదు.. భారతీయతపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు రణదీప్. లక్షలాది మంది దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్నారని, వారిని కూడా మోడీ ప్రభుత్వం విడుదల చేస్తారేమోనని అన్నారు. ఇది రాజీవ్ గాంధీ గురించి ప్రశ్న కాదని, హత్యకు గురైన ఓ ప్రధాన మంత్రి గురించి అని చెప్పారు. ఓ ప్రధాని హత్య కేసు దోషిని విడుదల చేశారంటే నేడు ఎలాంటి ప్రభుత్వం ఉందో, తీవ్రవాదంపై దాని వైఖరి ఏమిటో భారతీయులంతా తెలుసుకోవాలన్నారు.