ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్‌పై వడ్డీరేటును భారీగా తగ్గించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఇంత తక్కువ వడ్డీ ఇవ్వడం 40 ఏళ్లలో మొదటిసారి అవుతుంది. శనివారం ఈపీఎఫ్ఓ బోర్డు మెంబర్స్ సమావేశమై పై నిర్ణయాన్ని తీసుకొని ఫైలును ఆర్థిక శాఖకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత ఖాతాదారులకు వడ్డీ జమ చేస్తారు. కాగా, 1978లో 8 శాతం వడ్డీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇస్తున్నారు.