ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్ చేస్తే పీఎఫ్ వివరాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్ చేస్తే పీఎఫ్ వివరాలు

March 16, 2018

పీఎఫ్ వివరాలు, విత్ డ్రాయల్స్ వంటి ప్రక్రియలను కేంద్రం సులభతరం చేస్తోంది. పీఎఫ్ కార్యాలయానికి వెళ్లకుండా ఆన్ లైన్లోనే అన్నీ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పీఎఫ్ చందాదారులు 7738299899 నంబరుకు మిస్డ్‌కాల్‌, ఎస్‌ఎంఎస్‌ చేస్తే వారి ఖాతాల వివరాలు తెలుసుకోవచ్చని ఈపీఎఫ్ తెలిపింది.ఈ మొబైల్‌ నంబర్‌కు ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ యూఏఎన్‌ అని టైప్‌ చేయాలి. తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా వివరాలు అందుతాయి. ఇంగ్లిష్, హిందీల్లోనే కాకుండా తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లోనూ సమారాన్ని పొందొచ్చు. కేవలం స్మార్ట్‌ ఫోన్‌లోనే కాకుండా సాధారణ మొబైల్‌ ద్వారానూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ యూఏఎన్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఆధార్‌ నెంబరులను నమోదు చేసి 011-22901406 ఫోన్‌ నెంబరుకు మిస్‌కాల్‌ ఇచ్చి వివరాలు పొందవచ్చు. అలాగే యూఎంఏఎన్‌జీ ఏపీపీ అనే యాప్‌ ద్వారానూ  పీఎఫ్‌ వివరాలను పొందవచ్చు.