వ్యాపారంలో నీతికి చోటే ఉండదని మరోసారి తేలిపోయింది. మానవాళి సంక్షేమానికి వాడుకోవాల్సిన సైన్స్, టెక్నాలజీలను కొన్ని దేశాలు, కొన్ని కంపెనీ డబ్బు కోసం వాడుకుంటున్నట్లు మరోసారి బయటపడింది. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనెన పైజర్… సరికొత్త కరోనా వేరియంట్ వైరస్‌ను తయారుచేసింది. ఇది రొటీన్ ప్రయోగాల్లో భాగం సృషించిందేనని, భయపడాల్సిన పనిలేదని కంపెనీ చెబుతోంది. పరిశోధనల్లో భాగంగానే దీనికి పురుడు పోశామని చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్‌ను ప్రపంచంపైకి వదిలి, దానికి టీకాలు తనే తయారు చేసి డబ్బు చేసుకోవాలనే కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని వుహాన్ లేబొరేటరీలో కోవిడ్ 19ను తయారు చేసి ప్రపంచమ్మీదికి వదిలినట్టు చైనాపై విమర్శలు రావడం తెలిసిందే. ఫైజర్ వ్యవహారం కూడా అలాంటిదేనని నిపుణులు అనుమానిస్తున్నారు.
కొత్త వ్యాక్సీన్ కోసమంట..
ఫైజర్ పరిశోధన-అభివృద్ధి విభాగం డైరెక్టర్ డైరెక్టర్ జోర్డాన్ క్రిస్టన్ వాకర్.. ప్రాజెక్ట్ వెరిటాస్ అనే అండర్‌కవర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వైరస్ వేరియంట్ గురించి చెప్పాడు. సార్స్ కోవిడ్ 19కి కొత్తరకం వాక్సీన్ తయారీ కోసం మ్యుంటెంట్‌ను సృష్టించామని ఒప్పుకున్నారు. ‘‘కరోనా వైరస్ ఒరిజినల్ స్ట్రెయిన్ మేం పరిశోధనలు చేస్తున్నాం. యాంటీ వైరల్ డ్రగ్, ప్యాక్స్ లోవిడ్ టెస్టింగ్ కోసం మ్యుటేషన్లు తయారచేశాం’’ అని వివరించారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఫైజర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వేరియంట్‌ను తయారుచేసిన మాట నిజమేనని, అయితే దానివల్ల ప్రజలకు ముప్పేమీ లేది కంపెనీ తెలిపింది. ఫైజర్ ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాకంపెనీల్లో ఒకటి. ఇది జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ కంపెనీతో కలిసి ఇప్పటికే కోవిడ్ వ్యాక్సీన్ తయారు లక్షల కోట్ల లాభాలు దండుకుంది.