Pheasant Island is off-limits to the general public
mictv telugu

ఒక ద్వీపాన్ని రెండు దేశాలు పంచుకున్నాయి!

November 24, 2022

ఒక ప్రాంతాన్ని స్పెయిన్, ఫ్రాన్స్లు పంచుకున్నాయి. యుద్ధం తర్వాత ఒప్పందం చేసుకొని ఒక ద్వీపాన్ని సొంతం చేసుకున్నాయి దేశాలు. ఇంతకీ ఆ ప్రాంతం పేరేంటో.. ఆ ద్వీపం కథేంటో చదువండి.. స్పెయిన్ బాస్క్ దేశంలో.. స్పెయిన్, ఫ్రాన్స్ లను వేరు చేసే బిడాసోవా నది ఉంది. ఈ నది మధ్యలో ఉన్నద్వీపం పేరు ఫెసెంట్. దీన్నేనెమలి ద్వీపం అని పిలుస్తారు. ఈ ద్వీపాన్ని రెండు దేశాల ఉమ్మడి ప్రాంతంగా భావిస్తారు. 7 నవంబర్ 1659లో పైరినీస్ ఒప్పందం చేసుకొని రెండు దేశాలు ఈ ఉమ్మడి ప్రాంతాన్ని పాలిస్తున్నాయి. ఈ ఒప్పందం ముప్పై సంవత్సరాల యుద్ధం ముగిసిన తర్వాత చేసుకున్నారు.

ఆరు నెలలు స్పెయిన్, ఆరు నెలలు ఫ్రాన్స్కు చెందినదీ ద్వీపం. ప్రతీ ఫిబ్రవరిలో ఫ్రెంచ్, స్పెయిన్ ప్రతినిధులు ఫెసెంట్ ద్వీపంలో కలుస్తారు. ఫిబ్రవరి నుంచి ఈ ద్వీపం ఫ్రాన్స్ భూభాగం కింద లెక్క. ఆగస్టులో స్పెయిన్ దేశస్తులు తిరిగి ఈ ద్వీపాన్ని సొంతం చేసుకుంటారు. రెండు దేశాల తీరాల నుంచి ఈ ద్వీపాన్ని చూడొచ్చు. ఇది రెండు దేశాలకు.. సుమారు 50 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ద్వీపంలో జనావాసం లేదు. ఇందులోకి రెండు దేశాల నౌకాదళ కమాండ్ సభ్యులు మాత్రమే ప్రవేశించడానికి అనుమతి ఉంది. అంతేకాదు.. ఇరున్ లేదా హెండయే మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి శుభ్రపరుస్తారు. అంతేకాదు.. అక్కడ గార్డెనింగ్ చేసి ద్వీపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతారు.

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. సరిహద్దులు స్పష్టంగా గుర్తించారు. కానీ ఈ ద్వీపం పై మాత్రం ఒక క్లారిటీ రాలేదు. దీంతో ఆరు నెలల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం తర్వాత.. ఫ్రెంచ్ రాజు లూయిస్ XIV, స్పానిష్ రాజు ఫిలిప్ IV కుమార్తె వివాహాలను ఈ ద్వీపంలో అంగరంగ వైభవంగా చేశారు. ఈ ద్వీపంలో.. ఎలాంటి స్మారక చిహ్నాలు లేవు. కాకపోతే ఈ సంఘటనలను వివరించే స్మారక శాసనాన్ని ఏకశిలగా చెక్కారు. దీనిలో ఒకవైపు స్పానిష్ లో ఉండగా, ఫ్రాన్స్ వైపు కనిపించేలా ఫ్రెంచ్లో చెక్కబడి ఉంటుంది. ఇంకా ఈ ద్వీపంలో.. రాజ వివాహాలు, ఖైదీల మార్పిడి కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగించాలని అనుకున్నారు. శతాబ్దాలుగా రెండు దేశాల చరిత్రలో ఫెసెంట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది.