ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. అప్రమత్తమైన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. అప్రమత్తమైన పోలీసులు

August 11, 2020

Phone Call Warning to PM Modi

ప్రధాని నరేంద్ర మోదీకి హాని చేస్తానంటూ ఓ ఆగంతకుడు బెదిరింపులకు దిగాడు. ఏకంగా పోలీసు హెల్ప్ లైన్ నంబర్‌ 100కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడు డ్రగ్స్‌కు బానిసై ఇలా ఆకతాయి పని చేశాడని అనుమానిస్తున్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులో ఓ వ్యక్తి తాను ప్రధానికి హాని చేయబోతున్నట్టు చెప్పాడు. వెంటనే ఉన్నతాధికారులు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నారు.  హరియాణాకు చెందిన హర్భజన్ సింగ్‌గా గుర్తించారు. నిందితుడు విచారణ సమయంలో అతడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడని పేర్కొన్నారు. ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అతడు నిజంగా డ్రగ్ బానిసగా మారాడా అనే కోణంలో వైద్య పరీక్షలకు సిద్ధం అయ్యారు. బెదిరింపు కాల్‌తో భద్రతా సిబ్బంది కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.