డెలివరీ బాయ్‌ జననాంగాలనూ కోయబోయంది..! - MicTv.in - Telugu News
mictv telugu

డెలివరీ బాయ్‌ జననాంగాలనూ కోయబోయంది..!

March 30, 2018

స్మార్ట్‌ఫోన్ డెలివరీ ఆలస్యమైనందుకు ఢిల్లీలో ఒక మహిళ ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌ని 20 సార్లు కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. ఆమె, ఆమె సోదరుడు బాధితుణ్ని నరకయాతన పెట్టారు. కత్తిపోట్లతోపాటు చేయరాని ఘోరం కూడా చేయడానికి యత్నించింది ఆ దుర్మార్గురాలు. అతని మర్మాంగాలను కోసేయడానికి ప్రయత్నించింది. అయితే ఆమె సోదరుడు అడ్డుకున్నాడు.  బాయ్ వద్ద ఉన్న రూ. 40 వేల నగదును కూడా ఆ దుర్మార్గులు దోచుకుని, తర్వాత డ్రైనేజీలో పడేశారు.

ఢిల్లీలోని నిహాల్ విహార్‌లో మార్చి 21న ఈ ఘోరం జరిగింది. కమల్ దీప్(30) అనే మహిళ ఆన్‌లైన్‌లో రూ. 11 వేల విలువ చేసే ఫోన్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ కేశవ్‌కుమార్ సింగ్(21)కు ఆ రూట్ కొత్త కావడంతో కమల్ ఇంటిని త్వరగా కనుక్కోలేకపోయాడు. దీంతో చాలా ఆలస్యం చేశావంటూ ఆమె రెచ్చిపోయింది. ఇంట్లోంచి కిచెన్ నైఫ్ పట్టుకొచ్చి పొడిచేసింది. ఆమె సోదరుడు జితేందర్ సింగ్(34) కూడా దాడి చేశాడు. కమల్.. కేశవ్ గొంతుకు షూ లేస్ బిగించింది. అతని కడుపుమీద కూర్చుని దారుణంగా పొడిచింది. నోట్లోనూ కత్తిపెట్టి పొడవబోయింది. తర్వాత అతని జననాంగాలను కోయబోయింది. జితేందర్ అడ్డుకుని ఆమెను పైకి లేపాడు. కేశవ్ అరుపులు, కేకలు బయటివారికి వినిపించకుడా రక్కసులు థియేటర్ స్పీకర్స్ ఆన్ చేశారు.

కేశవ్ రక్తసిక్తమై  సృహ తప్పాక అతణ్ని ఇద్దరూ ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసిపోయారు. ఓ వ్యక్తి కేశవ్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వైద్యులు అతనికి మొత్తం 45 కుట్లు వేశారు. ఇది తనకు పునర్జన్మ అని కేశవ్ చెప్పాడు. కేశవ్, అతని తమ్ముడే వారికి కుటుంబానికి జీవనాధారం. ఫ్లిప్ కార్ట్ కంపెన అతడు కోలుకునే వరకు పనిచేయకుండానే జీతం ఇస్తామని పేర్కొంది. తన బిడ్డను ఆ దేవుడే బతికించాడని కేశవ్ తల్లి అంటోంది.