ఫోన్ కొంటే ఇప్పుడే కొనండి...లేదంటే డబుల్ షాక్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ కొంటే ఇప్పుడే కొనండి…లేదంటే డబుల్ షాక్..!

May 20, 2017

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు లోకి వస్తే మొబైల్ వినియోగదారులకు డబుల్ షాక్ తగులబోతోంది. కొత్త ఫోన్ కొన్నా…ఉన్నా ఫోన్ బిల్లు కట్టాలన్న జేబుకు చిల్లు పడాల్సిందే. మొబైల్ ఇండస్ట్రీని 12 శాతం, టెలికాం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లతో వినియోగత్వం, పెట్టుబడులు తగ్గిపోతాయని మొబైల్ ఫోన్ ఇండస్ట్రి ఆందోళన పడుతోంది.

ఇక తమ నెలవారీ 1000 రూపాయల మొబైల్ బిల్లుకు అదనంగా 30 రూపాయలు చెల్లించాల్సిందే. ప్రస్తుతమున్న టెలికాం సర్వీసుల పన్ను రేట్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగడంతో ఈ మేరకు మొబైల్ ఫోన్ బిల్లుల మోత మోగబోతోంది. అదేవిధంగా ప్రీపెయిడ్ యూజర్ల ఎఫెక్టివ్ టాక్ టైమ్ కూడా తగ్గిపోనుంది. జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మొబైల్ ఫోన్లు 4-5 శాతం ఖరీదుగా మారతాయి.

స్థానికంగా తయారుచేసే డివైజ్ లు కూడా మరింత ఖరీదైనవిగా మారునున్నాయి. 18 శాతం పన్నుపై టెలికాం ఇండస్ట్రీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక మొబైల్ ఇండస్ట్రి కూడా పెదవి విరిచింది. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు పెరగడంతో, స్థానిక మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది.