స్మార్ట్ ఫోన్ వచ్చిందెప్పుడు..? పదిహేనేళ్ల కిందటే కదా. కానీ 80 ఏళ్ల కిందటే ఇలాంటి ఫోన్లు చక్కర్లు కొట్టినట్లు ఓ పెయింటింగ్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇది హాట్ టాపిగ్గా మారిపోయింది. ‘Mr Pynchon and the Settling of Springfield’ పేరుతో Umberto Romano అనే చిత్రకారుడు ఈ చిత్రాన్ని 1937 వేశాడు. అమెరికాలోని స్ర్పింగ్ ఫీల్డ్ పట్టణంలో ఉందీ చిత్రం.
ఈ చిత్రంలో ఒక రెడ్ ఇండియన్ చేతిలో స్మార్ట్ ఫోన్ వంటి పరికరం కనిపిస్తోంది. అర్ధనగ్నంగా ఉన్న అతడు సెల్ఫీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మదర్ బోర్డ్ అనే నెట్ మేగజీన్ ఈ సంగతిని గుర్తించి పెయింటింగ్ ను పోస్ట్ చేసింది. ఇంకేం ఇది వైరల్ గా మారింది.
టైమ్ మిషీన్ లో గత కాలంలోకి, భవిషయత్ కాలంలోకి వెళ్లే వీలుంటుందని మనం విన్నాం కదా. ఈ చిత్రంలోని రెడ్ ఇండియన్ కూడా టైమ్ మెషీన్ లో భవిష్యత్తులోకి వెళ్లి ఉంటాడని కొందరు నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ 80 ఏళ్ల కిందటే కాదు 16వ శతాబ్దిలోనే ఉందని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ మ్యూజియంలో ఉన్న 17వ శతాబ్ది ఫొటోలో ఒక అబ్బాయి చేతిలో ఐ ఫోన్ వంటి పరికరం ఉంది. ఈ చిత్రాని పీటర్ డి హూచ్ వేశాడు.