కరోనా వైరస్ బాధితులకు 'ఫోన్‌ పే' ఇన్సూరెన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ బాధితులకు ‘ఫోన్‌ పే’ ఇన్సూరెన్స్

April 1, 2020

PhonePe announces insurance for Covid-19 treatment

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1637 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో 133 మంది కోలుకోగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే కేవలం రూ.156 కే బీమా పాలసీని తీసుకువచ్చింది. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో కరోనా కేర్ పేరుతో ఈ బీమాను అందుబాటులోకి తెచ్చింది. 

కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు ఈ బీమా ఆసరాగా ఉంటుందని వెల్లడించింది. ఒకేసారి రూ.156 చెల్లించి బీమా తీసుకుంటే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50,000 వరకు ఫోన్ పే చెల్లించనుంది. ఆసుపత్రిలో చేరడానికి ముందు, తరవాత మొత్తం 30 రోజుల పాటు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలుకు అయ్యే తదితర ఖర్చులను ఫోన్ పే చెల్లించనుంది. ఈ బీమాను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి 15 రోజుల్లోగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తేనే ఇది చెల్లుబాటు అవుతుంది. 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులు మాత్రమే దీనికి అర్హులు.