ఫోన్‌పే కొత్త ఫీచర్.. చాట్ చేస్తూ పైసలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్‌పే కొత్త ఫీచర్.. చాట్ చేస్తూ పైసలు..

February 3, 2020

Phone Pe.

డిజిట్ పేమెంట్ యాప్ ఫోన్ పే వినియోగదారుల సౌకర్యార్థం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ ఇతర మెసేజింగ్ యాప్ అవసరం లేకుండానే పేమెంట్ ధ్రువీకరించవచ్చని ఫోన్ పే సీఈఓ, సహా వ్యవస్థాపకుడు రాహుల్ చారీ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఫీచర్‌తో యూజర్లు తమ కాంటాక్టుల్లోని వారికి ఈజీగా నగదు పంపేలా రూపొందించాం. ఒకవైపు చాటింగ్ చేస్తూనే అదే బాక్సులో ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. యాప్ చాట్ ఫ్లోలో యూజర్ పేమెంట్ హిస్టరీ కనిపిస్తుంది. దీంతో యూజర్లు తమ చాట్ హిస్టరీతో పాటు తమ ట్రాన్సాక్షన్లకు సంబంధించి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. రానున్న వారాల్లో ఫోన్ పే యాప్ చాట్ ఫీచర్‌ను గ్రూపు చాట్‌లోకి డెవలప్ చేయనున్నాం. దీంతో గ్రూపులోని సభ్యులతో కూడా ఈజీగా మనీ రిక్వెస్ట్/కలెక్ట్ మనీ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. వారం క్రితమే ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల కోసం ఫోన్ ఫే ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. కంపెనీ డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే యూజర్లు 185 మిలియన్లకు పైగా ఉన్నారు’ అని రాహుల్ వెల్లడించారు.