ప్రముఖ యూపీఐ పేమెంట్ సంస్థ ఫోన్ పేకి ఫ్లిప్ కార్ట్ తో ఉన్న బంధం ముగిసింది. ఈ రెండు సంస్థల మధ్య యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీన్ని ధ్రువీకరిస్తూ రెండు సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. అయితే ఈ రెండు కంపెనీల్లోనూ వాల్ మార్ట్ ప్రధాన వాటాదారుగా కొనసాగనుంది. ఈ పరిణామం వల్ల ఫోన్ పే పూర్తి ఇండియన్ కంపెనీగా మారుతుంది. దీని వల్ల ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) లో చేరనుంది. కాగా, ఫోన్ పేను ఫ్లిప్ కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ అయిన సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజనీర్ అనే ముగ్గురు వ్యక్తులు 2015లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ యాప్ చెల్లింపుల్లో రికార్డు స్థాయిలో దూసుకెళుతోంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీరుస్తోంది. ఏ బడ్డీ కొట్టుకు వెళ్లినా ఫోన్ పే లేకుండా ఉండవంటే దీనికున్న ప్రజాదరణ అర్ధం చేసుకోవచ్చు.