ఫోన్లు, కార్లు క్రైస్తవులవి.. హిందువులం కదా, పారేద్దామా?: శివాజీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్లు, కార్లు క్రైస్తవులవి.. హిందువులం కదా, పారేద్దామా?: శివాజీ

February 3, 2020

Shivaji.

మనం వాడే ఫోన్లు, కార్లు క్రైస్తవులవి.. మనం హిందువులం కదా వాటిని ఎలా వాడతాం? పారేద్దామా మరి? అంటూ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కార్లు మనం తయారు చేయాలేదు.. అవీ క్రిస్టియన్లవే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. వాటిని వాడటం మానేద్దామా? మనం హిందువులం కదా? వాటిని తీసి బయట పడేద్దామా? మన మైండ్‌లో ఉన్న ఈ దరిద్రాన్ని తీసేస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. లేదంటే ఇప్పుడు ఉన్నట్టుగానే ఐసీయూలో ఉంటుంది’ అని శివాజీ వ్యాఖ్యానించారు.

పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయడానికి రెండు వేల కోట్లు ఖర్చుపెట్టి.. రివర్స్ టెండరింగ్‌లో 500 కోట్లు తెచ్చి లాభం ఏముంది? అని ప్రశ్నించారు. ‘వాళ్లు నిజంగా తప్పు చేసి ఉంటే.. ఆయా కంపెనీలకు ఎక్కువ మొత్తానికి టెండరింగ్ ఇస్తే, వాటిని కట్ చేసి ఇంతే ఇస్తాం అని చెప్పి పని చేయనీయండి. వాటిని ఎందుకు తీసేయాలి. ఏమైనా మాట్లాడితే చాలు నవయుగ కంపెనీ వేరు అంటారు. మరేమైనా అంటే కమ్మా అంటారు. వేరే కులం వాడు ఏదైనా చేస్తే దాన్ని ఆక్సెప్ట్ చేయకూడదా?’ అని అన్నారు.

కాగా, ఏపీ రాజధాని అంశంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్న సందర్భంలో శివాజీ మళ్లీ తెరమీదకు వచ్చారు. ఈసారి వైసీపీ ఏదో మాయ చేసి గెలిచిందని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని శివాజీ జోస్యం చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాకపోతే ఆంధ్రప్రదేశ్ మరిపోవడమే అంటున్నారు.