తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రచార రథాలు, అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు ‘ఫోటో కొట్టు -బహుమతి పట్టు’ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం జీహెచ్ ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.ఇందులో 18 ఏళ్లు నిండి ఓటర్ కార్డు ఉన్న వారు ఎన్నికల ప్రాధాన్యతకు సంబంధించి మంచి పొటోతో కూడిన క్యాప్షన్‌ను రాసి 799315333 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని, మెస్సేజ్ చేసిన వారు తమ ఓటరు ఐడీ కార్డు కూడా జతచేసి పంపించాలి. ఈ రోజు నంచి నవంబర్ 16 వరకు వాట్సప్ ద్వారా పంపిన ఫొటోల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలను ఎంపిక చేస్తారు. మొదటి బహుమతిగా రూ.25,000, రెండో బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.15,000 ఇవ్వనున్నారు. అయితే పోటీల్లో పాల్గొనే వారు హైదరాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఇక్కడి ఓటర్ కార్డు ఉండాలని అధికారులు పేర్కొన్నారు.