కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఓ చట్టాన్ని అమలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫోటో కొట్టు – రివార్డు పట్టు అనే పేరుతో ఓ చట్టం త్వరలోనే రాబోతుందని, ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా వాహనదారులు రోజు రోజుకు ప్రభుత్వ నిబంధనలు మరిచి, ఎక్కడపడితే అక్కడ రాంగ్ పార్కింగ్ చేస్తూ, ట్రాఫిక్ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ రాంగ్ పార్కింగ్ సమస్యకు అడ్డుకట్ట వేసేలా ఈ చట్టం పని చేస్తోందని ఆయన అన్నారు. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వారికి చట్టం ప్రకారం రివార్డ్‌ను కూడా ఇస్తామని పేర్కొన్నారు.
నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..”రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా ఓ చట్టాన్ని పరిశీలిస్తున్నాం. రాంగ్ పార్కింగ్ కారణంగా తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తోపాటు, రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయి. రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి మొబైల్‌లో ఫొటో తీసి పంపితే, సదరు వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తాం. ఫొటోను పంపిన వ్యక్తికి రూ.500 రివార్డ్ ఇస్తాం. దీంతో పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుంది. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడం విచారించదగ్గ విషయం” అని ఆయన అన్నారు.
మరోపక్క తాజాగా కేంద్ర ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పాసైన వారికి నాలుగేండ్లపాటు దేశానికి సేవలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పేరుతో పథకం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని గురువారం బీహార్‌లోని ఛాప్రాలో నిరసనకారులు రైలుకు నిప్పుపెట్టారు. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని ఈ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా తీవ్రంగా యువత ఆందోళన చేపట్టారు. ఈ ఆందోనల్లో పలు బస్సులు, రైళ్లు దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో త్వరలోనే మరో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.