భూమ్మీద నివసిస్తున్న మనకు ఆకాశంలో చూస్తే చంద్రుడితో పాటు ఎన్నో కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. బైనాక్యులర్ వంటి పరికరాలతో చూస్తే దూరంగా ఉన్న కొన్ని గ్రహాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అయితే వేరే గ్రహాల నుంచి చూస్తే మన భూమిని చూస్తే ఎలా కనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా ఇలా ఆలోచించి అందుకు సంబంధించిన ఫోటోను విడుదల చేసింది. అంగారకుడిపై నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ దీన్ని తీసింది. ‘ఈ అద్భుత ఫోటో మార్స్ నుంచి తీసింది. ఫోటోలో చిన్నగా నక్షత్రం మాదిరి కనిపించేదే మనం నివసించే భూగ్రహం’ అని పేర్కొంది. ఈ ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘ఈ ఫోటో మనకు ఏదైనా నేర్పుతుందంటే.. అది వినయమే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
If there’s just one thing this photo should teach us….it’s humility.. https://t.co/S2WN9thBBd
— anand mahindra (@anandmahindra) July 21, 2022