ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో యుద్ధ విమానాలు ఒక దాని తరువాత మరొకటి దూసుకొస్తున్నాయి. అలాగే ఇంకో విమానాలో ఒక వ్యక్తి ఉండి యుద్ధవిమానాలు ఎలా రావాలో సూచనలు ఇస్తూ ఫోటోలు ఇస్తున్నాడు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంతకీ ఏ వీడియో ఎంటని నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ వీడియో సౌదీ అరేబియా యుద్ధ విమానాల రిహార్సల్స్‌కి సంబంధించిందని తెలిసిందే. సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా అక్కడి వాయుసేన రిహార్సల్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని విమానాలు గాల్లోకి లేవగా, మరో విమానంలో వెనుక ర్యాంప్‌పై కూర్చున్ని ఫొటోగ్రాఫర్ గుంపుగా ఎగురుతున్న విమానాలకు ఒక పద్ధతిలో రండంటూ సూచనలు చేశాడు. సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా యుద్ధ విమానాల ఫోటో షూట్ జరిగింది.
@RafaWildNature ??On the occasion of the National Day of Saudi Arabia, a photographer directs the pilots to take pictures of them while preparing for the air show in the sky of Saudi Arabia?? pic.twitter.com/mxjGUG9cWr
— ꧁ ????? ??????? ꧂ (@saleh_alazzaz) September 22, 2020