సెల్ఫీ కోతితో పంచాయతీ చేసుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ కోతితో పంచాయతీ చేసుకున్నాడు..

September 12, 2017

ఓ కోతి ఎంతో ముచ్చటపడి తీసుకున్న సెల్ఫీలపై అమెరికాలో ఆరేళ్లుగా నడుస్తున్న పంచాయతీ ఎట్టకేలకు తెగింది.  ఓ ఫొటోగ్రాఫర్ కెమెరాతో కోతి వయ్యారంగా ‘తీసుకున్’ సెల్ఫీ ఫోటోలపై కాపీ రైట్ హక్కులు ఎవరికి చెందాలో అమెరికా కోర్టు నిర్ణయించింది. ఫొటోలపై ఆదాయంలో 25 శాతం కోతికి ఇవ్వడానికి, మిగతా 75 శాతం తను తీసుకోవడానికి కెమెరా యజమాని.. అనగా ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అంగీకరించారు. సంగతేమంటే.. స్లేటర్ 2011లో ఇండోనేసియాలోని సులవేసి దీవికి వెళ్లాడు. జంతువులను, పక్షులను ఫొటోలు తీసుకున్నాడు.

ఆ సమయంలో మాకాక్ జాతికి చెందిన పెద్ద కోతి అతని కెమరాపై మోజుపడింది. కెమెరా తీసుకుని సెల్ఫీలును ఫట్ ఫట్ మని క్లిక్ మనిపించింది. అంతవరకు బాగానే ఉంది కానీ తర్వాత గొడవ రేగింది. ఈ ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం జరగడంతో జంతుహక్కుల సంస్థ పెటా రెండేళ్ల కిందట కోర్టుకెక్కింది. కోతి (నరుటా అని తర్వాత పేరు పెట్టారు) తీసుకున్న ఫొటోలపై ఆదాయం మొత్తం దానికే చెందాలని, ఆ ఫోటోలు నరుటా సృజనాత్మకతకు చిహ్నమని గట్టిగా వాదించింది. అయితే ఫొటోలపై హక్కులు స్లేటర్ పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ పర్సనాలిటీ లిమిటెడ్ కంపెనీకి చెందుతాయని, కెమెరా అతనిదే కనుక కాపీరైట్ కంపెనీకే చెందాలని అతని లాయర్లు వాదించారు. అప్పటి నుంచి సాగుతున్న కేసుపై సోమవారం శాన్ ఫ్రాన్సిస్కో కోలోని సర్క్యూట్ కోర్టు తీర్పించిది. ఒప్పందం కింద కోతికి దక్కే సొమ్మును ఇండోనేసియాలోని మకాక్ కోతుల సంరక్షణకు వినియోగిస్తారు.