ప్రభాస్ ‘సలార్’ ఫోటోలు లీక్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ ‘సలార్’ ఫోటోలు లీక్

May 24, 2022

పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రం ఫోటోలు లీక్ అయ్యాయి. మంగళవారం నుంచి సలార్ రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవగా, తొలిరోజే ఫోటోలు లీక్ అవడంపై సినిమా యూనిట్ షాకవుతోంది. ఇందులో ప్రభాస్ ఓ యువతితో మాట్లాడుతున్న ఫోటో, మాస్ డ్రెస్సింగ్ స్టైల్లో కుర్చీలో కూర్చున్న ఫోటో, షూటింగ్ సైట్ ఫోటోలు ఉన్నాయి. వీటిని బట్టి భారీ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. జగపతిబాబు, మలయాళ హీరో పృథ్వీరాజ్ కుమార్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఇటీవలే ప్రభాస్ అభిమాని ఒకరు సలార్ సినిమా అప్డేట్ ఇవ్వమని రక్తంతో లెటర్ రాశాడు. మరొక అభిమాని కేజీఎఫ్ స్టైల్లో ప్రభాస్ యానిమేషన్ చిత్రాన్ని క్రియేట్ చేసి సలార్ టీంకి ట్వీట్ చేశాడు. తాజా ఫోటోల లీక్‌తో ఇలాంటి ప్రభాస్ అభిమానులకు సంతోషం కలిగించినట్టయింది.