తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగాల జాతరలో భాగంగా టీఎస్పీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లను రిలీజ్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయగా, తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 148 వ్యవసాయ అధికారి పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ల ఖాళీలు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఉండగా, సాంకేతిక విద్యాశాఖలో 37 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వ్యవసాయ అధికారి పోస్టులకు జనవరి 10 నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని, మిగతా వివరాలను అధికారిక వెబ్ సైట్ చూడాలని టీఎస్పీఎస్సీ కోరింది.