Pics Of Girls Cleaning Toilets At Madhya Pradesh Government School Trigger Outrage
mictv telugu

టీచర్లా, మున్సిపాలిటీ కాంట్రాక్టర్లా… పిల్లలతో ఆ పని చేయిస్తారా?

September 23, 2022

విద్యాబుద్దులు నేర్చుకునేందుకు పాఠశాలకు వచ్చిన పిల్లలతో.. బాత్రూమ్‌లను, టాయిలెట్లను శుభ్రం చేయించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలికలు చీపురు పట్టి టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ, కడుక్కుంటున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఆ పాఠశాలలో ఐదు, ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్‌ టాయిలెట్‌ను మంగళవారం శుభ్రం చేయించారు. వారి నీటి కోసం దూరంలో ఉన్న హ్యాండ్‌ పంప్‌ ను వినియోగిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. బాలికలు టాయిలెట్లు క్లీనింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రఘువంశీ మాట్లాడానికి నిరాకరించారు.అదే సమయంలో ఈ ఘటనపై గుణ కలెక్టర్ ఫ్రాంక్ నోబుల్ మాట్లాడుతూ.. ఈ విషయం దృష్టికి వచ్చిందని, దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, విద్యార్థినుల పట్ల ఇలాంటి ప్రవర్తన అస్సలు సహించేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ వార్తలను జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఖండించారు. విచారణలో బాలికలు, తాము మరుగుదొడ్లను శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారడంతో మరుగుదొడ్లను ఉపయోగించి మంగళవారం ప్రాంగణంలోని చేతి పంపు నుండి నీటిని తెచ్చి పోశామని స్పష్టం చేసినట్లు డీఈవో సోనమ్ జైన్ తెలిపారు. బాలికలతో పాటు వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది యొక్క స్టేట్‌మెంట్‌లను తాను రికార్డ్ చేశానని చెప్పారు. అయితే విద్యార్థినులు తమ చేతుల్లో చీపుర్లు పట్టుకుని, చేతి పంపు నుండి నీటిని తీసుకుని మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నట్టు కనిపించిన ఫోటోలపై రాష్ట్ర మంత్రి సిసోడియా సీరియస్ అయ్యారు. కు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.