ఈ పిల్లను అయ్యో పాపం అనకండి.. ఎందుకంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పిల్లను అయ్యో పాపం అనకండి.. ఎందుకంటే.. 

November 28, 2019

ముద్దులొలికే పాపాయి. క్యూట్‌గా ఉంది కదూ. కానీ, పాప కాళ్లేంటి అంత సన్నగా ఉన్నాయి అని అనుకుంటున్నారు కదూ. పాపం పోలియో బాధితురాలని బాధపడుతున్నారు కదూ. కానీ ఆ పాపకు ఏ జబ్బూ లేదు. ఎంత ముద్దుగా ఉందో అంత చక్కగా ఆరోగ్యంగా ఉంది. మరి కాళ్ల సంగతేంటని అంటారా? అక్కడికే వస్తున్నాం. అయితే మీరు ముందు ఈ ఫోటోను మరోసారి తేరిపారా చూడండి. అయినా అంతుచిక్కడం లేదా. మరోసారి కళ్లు చికిలించి చూడండి. ఆ.. ఇప్పుడు కనిపించింది కదూ ఆ ఫోటోలోని అసలు రహస్యం. ఆ పాప చేతిలో పాప్‌కార్న్ ప్యాకెట్ ఉంది. ఆ ప్యాకెట్ కలర్, చుట్టూ ఉన్న గ్రౌండ్ రంగులో కలిసిపోయింది. దీంతో ఈ ఫోటో మాయాజాలం ఏర్పడింది.  

 

ఈ ఫోటో చూసేవాళ్లందరికి అయ్యో పాప కాళ్లేంటి అంత పొడవుగా సన్నగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇదే ఫోటో మాయాజాలం అంటే. అందుకే అంటారు ఒక్కోసారి మన కళ్లను మనమే నమ్మలేం అని. నిజంగా ఎంతో పరిశీలనగా చూస్తే తప్ప పాప చేతిలో పాప్‌కార్న్ ప్యాకెట్ ఉన్నట్లు కనిపెట్టలేం. కాగా, ఈ ఫోటోకు ఇప్పటికే కొన్ని వేల లైకులు వచ్చాయి. మొదట ఈ ఫోటోను చూసిన వాళ్లంతా ‘అయ్యో పాపం’ అంటూ కామెంట్లు పెట్టారు. అసలు విషయం తెలిసిన తరువాత అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.