ఫిదా సినిమా చూసిన కేసీఆర్ ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఫిదా సినిమా చూసిన కేసీఆర్ ..!

July 24, 2017

ఫిదా సినిమాకు ప్రజలే కాదు..తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిదా అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూవీని చూశారు. సినిమా యూనిట్ ను అభినందించారు. ఫిదా చిత్రాన్ని చూసి అభిందించిన సీఎం కేసీఆర్ కు నిర్మాత దిల్ రాజు కృతజతలు తెలిపారు.

వరుణ్ తేజ్ , సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా సినిమాను తీశారు. తెలంగాణ నేపథ్యంలో మూవీని తీశారు. యాసకు , భాషకు ప్రయారిటీ ఇచ్చారు. అచ్చం తెలంగాణ అమ్మాయిలా సాయి పల్లవి యాక్టింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. హిట్ టాక్ కొట్టిన ఫిదా..థియేటర్లలో వీకెండ్ లో అన్ని షోలు హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ సినిమా ను ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఫిదా అయ్యారు. చక్కగా తీశారని దిల్ రాజు తో పాటు ఆ సినిమా యూనిట్ ను మెచ్చుకున్నారు.