అడివిలో ఉండే క్రూర మృగాలే కాదు…జనావాసాల మధ్య బతికే కుక్క, పందులను చూసిన భయపడాల్సి వస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు బయట ఒంటగా కనపడితే చాలు గుంపుగా లేక సింగిల్‌గా దాడి చేసి ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇప్పటి వరకు కుక్కలు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. తాజాగా పంది ఓ చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండా జిల్లాలో జరిగింది.
ఇంటి ముందు ఓ చిన్నారి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఇంతలోనే ఎక్కడి నుంచో వచ్చిన ఓ పంది అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది. బాలుడి చేతులను, ఉదర భాగాన్ని తీవ్రంగా గాయపర్చింది. అతడు పందిని తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భయంతో చిన్నారి పెద్ద పెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పందిని తోలేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంది దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల కుక్కలు దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఓ బాలుడు, ఢిల్లీలో ఇద్దరు చిన్నారులు, ఖమ్మం జిల్లాలోని రఘునాథ పాలెంలో ఓ బాలుడిని ఊరకుక్కలు చంపేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలను చూసిన తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. చిన్నారులను బయటకి పంపంపేదుకు జంకుతున్నారు. అధికారుల కూడా వీటిపై పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
https://www.indiatoday.in/india/video/maharashtra-kid-sustains-severe-injuries-in-pig-attack-2346332-2023-03-14?jwsource=cl
ఆహారంలో మార్పులు కారణంగానే కుక్కలు వంటి జంతువులు మనుషులపై దాడులు చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా నాన్‌వెజ్‌కి అలవాటు పడిన కుక్కలు అది దొరకని సమయంలో ఇలా మనుషులు, పశువులపై దాడికి దిగుతున్నాయంటున్నారు.