ఇదేం కుమ్ముడురా బాబాయ్.. రిపోర్టర్‌ను వేధించిన ఆడపంది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం కుమ్ముడురా బాబాయ్.. రిపోర్టర్‌ను వేధించిన ఆడపంది..

November 28, 2019

న్యూస్ లైవ్  కవరేజ్ చేసే సమయంలో జర్నలిస్టుల తిప్పలు అంతా ఇంతా కావు. వార్త కోసం ఎక్కడికైనా వెళ్లి సమాాచారం అందించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని సమయాల్లో ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఓ జర్నలిస్ట్  లైవ్ కవరేజ్ కోసం వెళ్లి తానే వైరల్‌గా మారిపోయాడు. గ్రీకు జర్నలిస్టును ఓ పంది వెంటపడటంతో న్యూస్ ఛానెల్‌లో ప్రసారం అయింది. పందితో ఆ రిపోర్టర్ పడిన ఇబ్బంది చూసిన వారంతా తెగ నవ్వేసుకుంటున్నారు. 

ఏథెన్స్‌‌ ప్రాంతాన్ని ఇటీవల తుపాను కారణంగా వరదలు ముంచెత్తాయి. అక్కడి పరిస్థితిని వివరించేందుకు ఓ ఛానెల్ రిపోర్టర్ లాజోస్ మాంటికో అక్కడికి వెళ్లాడు.  లైవ్ కవరేజ్ ఇస్తూ ఉన్న సమయంలో ఓ పంది అక్కడికి వచ్చి అతడి చుట్టూ తిరుగుతూ ఆట ఆడించింది. అదంతా లైవ్‌లో ప్రసారమైంది. ఎంత సేపటికి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ పంది మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు. అతన్ని అది ముప్పు తిప్పలు పెట్టడాన్ని చూసిన యాంకర్లు తెగ నవ్వుకున్నారు. చేసేదేమి లేక పంది కారణంగా తన రిపోర్టింగ్ మధ్యలోనే ఆపేస్తున్నట్టు చెప్పాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.