ఈ వార్త ఎవరినీ కించ పరచటానికి కాదు కేవలం సమాచారం కోసమే !
ఆగస్టు 7 న తమిళనాడలో పందులకు ఉపనయన మహోత్సవం జరగనుంది. ఏంటీ.. పందులకు ఉపనయనం ఏంటని కొందరు సాంప్రదాయవాదులు కట్టగట్టుకొని యుద్ధం ప్రకటించేరు ? వద్దు వద్దు.. ఇది కేవలం మనువాదుల మూసుకున్న కళ్లను తెరిపించడం కోసమే అని అంటున్నారు నిర్వాహకులు. పెరియార్ భూమిపై జంధ్యం ధరించిన మనిషి పవిత్రంగా మారినప్పుడు పంది కూడా జంధ్యం ధరించి పవిత్రంగా మారడంలో తప్పేం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మనుషులు దురహంకారంతో ఎక్కువ కులం, తక్కువ కులం అంటూ సాటి మనుషుల్ని మనుషులుగా చూడటం లేదు. వారికోసమే మా ఈ పంది ప్రయత్నమని చెప్తున్నారు వాళ్ళు.