పావురాలను వదిలాడని చిన్నారిని చంపాడు! - MicTv.in - Telugu News
mictv telugu

పావురాలను వదిలాడని చిన్నారిని చంపాడు!

February 9, 2018

క్షణికావేశంలో జరిగే హత్యలు ఎక్కువైపోతున్నాయి.  తన పావురాలను బోను తెరిచి వదిలేశాడంటూ రెండేళ్ల బాలుడిని 14 ఏళ్లబాలుడు దారుణంగా చంపేశాడు. బాలుడి గొంతుపై  కాలుపెట్టి తొక్కి చంపేశాడు. బెంగళూరులో బుధవారం జరిగింది.సోలదేవనహళ్లిలో బసవరాజ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని పొరుగింటివారితో చిన్నిచిన్న విషయాల్లో గొడవలు జరిగేవి. పొరిగింటికి చెందిన వ్యక్తి కుమారుడు(14) పదిరోజుల కింద రూ. 100కు మూడు పావురాలు కొన్ని పంజరంలో పెట్టి పెంచుకుంటున్నాడు.  బుధవారం మధ్యాహ్నం బసవరాజ్ రెండేళ్ల కొడుకు వెంకటేశ్ ఆడుకుంటూ ఆ పావురాల బోను వద్దకు వెళ్లి బోను తలుపు తీశాడు. దీంతో పావురాలు ఎగిరిపోయాయి. వాటిని పెంచుతున్న 14 ఏళ్ల బాలుడికి ఎక్కడా లేని కోపం వచ్చింది. వెంటకేశ్‌ను రోడ్డుపై పడేసి, గొంతుపై కాలుతో తొక్కుతూ చంపేసి పారిపోయాడు. సవరాజ్ తన కొడుకు కోసం ఇంటి నుంచి బయటికొచ్చాడు. దగ్గర్లోని పొదల్లో బాలుడి శవం కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులుతెలిపారు.