భక్తులు పరేషాన్… యాదాద్రిలో బూజుపట్టిన 1800 లడ్డూలు… - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులు పరేషాన్… యాదాద్రిలో బూజుపట్టిన 1800 లడ్డూలు…

October 8, 2018

పవిత్ర పుణ్య క్షేత్రమైన యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లడ్డూలు బూజుపట్టాయి. సుమారు 1800 లడ్డూల వరకు పాడయ్యాయి. రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లడ్డూలు అవి. చేసేదేంలేక అధికారులు వాటిని పారబోశారు. ఓ భక్తుడు ప్రసాదాన్ని కొనుగోలు చేసి తినేందుకు లడ్డూను రెండు ముక్కలు చేశాడు. ఇంతలో లోపలంతా బూజుపట్టి వుంది. వెంటనే అతను వెళ్ళి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు అక్కడున్న 30 ట్రేలలోని లడ్డూలను పరిశీలించారు.Pilgrims shock ... 1800 Brownies blown up in Yadadri …అన్నీ లడ్డూలు అదేవిధంగా బూజుపట్టి వున్నాయి. దీంతో అన్నింటినీ పారబోయక తప్పలేదు.  తయారీలో నాణ్యత లోపించడం, భద్రపరిచే చర్యల్లో లోపాల కారణంగా లడ్డూలు పాడై ఫంగస్ వచ్చినట్టు తెలుస్తోంది. కౌంటర్ గదుల్లో లడ్డూలకు సరైన గాలి ఆడకపోవడంతో, వేడి ఎక్కువై బూజు వచ్చినట్టు చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో భక్తుల రద్దీ తగ్గడంతో ప్రసాదాల విక్రయం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు.