గాల్లో విమానం.. నిద్రపోయిన పైలెట్లు.. తర్వాత ఏం జరిగిందంటే
37 వేల అడుగులు అంటే దాదాపు పది కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోని ఇద్దరు పైలెట్లు ఆదమరిచి నిద్రపోయారు. చివరికి ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ పోర్టును కూడా దాటేశారు. తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి ప్రయాణీకులను ప్రమాదంలో పడేసిన ఈ ఘటన ఈ నెల 15న ఇథియోపియాలో జరిగింది. వివరాల్లోకెళితే.. ఇథియోపియా ఎయిర్ లైన్స్‌కి చెందిన ఓ బోయింగ్ విమానం సూడాన్‌లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాకు బయల్దేరింది.
మార్యమధ్యంలో పైలెట్లు విమానాన్ని ఆటో పైలెట్ మోడ్‌లో పెట్టి సుబ్బరంగా నిద్రకు ఉపక్రమించారు. వారు నిద్రలో ఉండగానే విమానం గమ్యస్థానానికి చేరుకుంది. విమానం వస్తుందని ఎదురు చూసిన గ్రౌండ్ సిబ్బంది దాని కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపు చూపి ఏటీసీ పైలెట్లను సంప్రదించగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా 25 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత విమానం ఆటో పైలెట్ మోడ్ సెట్ చేసిన టైమర్ పూర్తవ్వడంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఆ తర్వాత గట్టిగా అలారం మోగడంతో అప్పడు కుంభకర్ణ నిద్ర వదిలిన పైలెట్లు తప్పిదాన్ని గ్రహించి విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారో తెలియరాలేదు కానీ ఎవరికీ ఎలాంటి గాయం కాలేదు.