Home > Featured > గన్‌మెన్లు వద్దు, స్వేచ్ఛగా తిరుగుతా.. పినపాక ఎమ్మెల్యే

గన్‌మెన్లు వద్దు, స్వేచ్ఛగా తిరుగుతా.. పినపాక ఎమ్మెల్యే

Pinapaka MlaReject gun man

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తనకు కేటాయించిన గన్‌మెన్లను తిప్పి పంపించారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశారు. తన భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని, ప్రత్యేకించి గన్‌మెన్లు వద్దని తిరస్కరించారు. రైతు కూలి కుటుంబం నుంచి వచ్చిన తనకు హంగూ ఆర్భాటాలు అవసరం లేదని తేల్చి చెప్పారు.

సాధారణంగా ఎమ్మెల్యేల భద్రత కోసం ‌గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో భాగంగా రేగ కాంతారావుకు కూడా కేటాయించారు. అయితే తన నిర్ణయం వెనక ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ప్రజల్లో కలిసి స్వేచ్ఛగా తిరగాలనే తాను ఈ విధంగా చేసినట్టు చెప్పారు. తన గన్‌మెన్లను ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నుంచి కాంతారావు కాంగ్రెస్ తరుపున గెలిచి తరువాత టీఆర్ఎస్‌లో చేరారు.

Updated : 14 Aug 2019 9:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top