పింగళి వెంకయ్య ముని మన్మరాలికి..”ఫిదా” సిన్మాకి లింకేంటి...! - MicTv.in - Telugu News
mictv telugu

 పింగళి వెంకయ్య ముని మన్మరాలికి..”ఫిదా” సిన్మాకి లింకేంటి…!

July 28, 2017

భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య అని దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు,అయితే  ఈయన ముని మన్మరాలు పింగళి చైతన్య ఫిదా సిన్మకి కో-రైటర్ గా& అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.ఫిదా సినిమా సక్సెస్ లో ఈమె పాత్రకూడా చాలానే ఉందనే చెప్పాలి.అంతేకాదు ఆమె రాసిన “చిట్టగాంగ్ విప్లవ వనితలు”అనే పుస్తకానికి  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.ఆమె ప్రతిభ తెలుసు కాబట్టే  శేఖర్ ఖమ్ముల  “ఫిదా” సిన్మాలో ఆమెను కూడా భాగం చేసారనేది తెలుస్తుంది.

పింగళి చైతన్య గురించి…మరికొన్ని మాటల్లో

చైతన్య పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది కోదాడ దగ్గర నందిగామలో..ఆమె తండ్రి పింగళి దశరథరామ్..ఈయన నిఖార్సయిన సోషలిస్టు. చైతన్య చిన్నప్పుడే ఆయన హత్యకు గురయ్యారు.ఒకప్పుడు ఎన్ కౌంటర్ అనే పత్రిక నడిపేవాడు,ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను, ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారి కుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. అవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదాపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్ఫూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. ఎన్‌కౌంటర్ పత్రిక అప్పట్లో అందులో వ్రాయబడే సంచలనాత్మక విషయాల వల్లనగాని, వ్రాసే విధానం వల్లన గాని రాష్ట్రంలో మూల మూలలకు పాకి పోయిందట.

పింగళి చైతన్య.. పుస్తకాల గురించి…

ఈమె ఇప్పటివరకు రెండు పుస్తకాలు రాసింది,ఒకటి చిట్టగాంగ్ విప్లవ వనితలు,రెండోది మనసులో వెన్నెల.ఈమె విజయ విహారం పత్రికలో కొంతకాలం పనిచేసింది,2016 ఆమె రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది,మహిళలు రహస్య సాయుధ దళాల్లో చేరి తుపాకీ పట్టి స్వాతంత్ర పోరాటం కోసం సాయుధ పోరు వీర వనితల సాహస గాథలే చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం.భారత స్వాతంత్రోద్యమంలో చిట్టగాంగ్ మహిళలు చేసిన పోరాటాలు,త్యాగాలు ,వారు చూపిన తెగువ కళ్లకు కట్టినట్టు గా ఈ పుస్తకంలో రాసారు  పింగళి చైతన్య గారు.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను  ధైర్యంగా ఎదుర్కొని  ముందుకు సాగుతున్న పింగళి చైతన్య ఎపుడు ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు..నేర్చుకుని చెయ్యను,చేసేటప్పుడే నేర్చుకుంటాను అని.రచయిత్రిగా,జర్నలిస్టుగా  ఆమె ఇంకా ఎన్నో విజయాలను  చేరుకొని..మరిన్ని అవార్డులను అందుకోవాలని  కోరుకుందాం.