Pingara movie gains applauded before kantara
mictv telugu

కాంతారకు తాత పింగార.. 2019లోనే అద్భుతమైన మూవీ

October 21, 2022

పురాణం, భక్తి, పోరాటం.. అద్భుతమై డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్.. కమర్షియల్ ఎలిమెంట్స్.. వెరసి కాంతార! కన్నడంలోనే కాదు మిగతా భాషల్లోనూ దుమ్మురేపుతున్న కాంతార మూవీలో ఆధ్యాత్మిక నృత్యం భూతకోల మూవీకే హైలెట్. ఈ సినిమాకు విస్తృత ఆదరణ రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఆ కళకారులకు పింఛన్ కూడా ప్రకటించింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార హవా కొనసాగుతున్న నేపథ్యంలో మరి పాత విషయం కొత్తగా బయటపడింది.

కాంతార మూవీలో చూపిన భూతకోల నృత్యం కథలో 2019లోనే ‘పింగార’ పేరుత తుళు, కన్నడ భాషల్లో ఓ చిత్రం వచ్చింది. అయితే ఫక్తు కళాత్మక చిత్రం కావడంతో కేవలం ఫిలిమ్ ఫెస్టివల్స్ కు మాత్రమే పరిమితమైంది. అట్టడుగు కులాలపై వివక్షకు వ్యతిరేకంగా రూపొందిన ఈ మూవీని కూడా మిత్, ఆర్ట్, అద్భుత పెర్మామన్స్ జోడించి తీశారు. హిట్ ఫార్ములాను నమ్ముకోకుండా వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అందుకే పింగార పలు చలనచిత్రోత్సవాల్లో మెరిసింది. ప్రీతమ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ ప్యారలల్ చిత్రానికి 2019లో ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు దక్కింది. కాంతరతో పోలిస్తే పింగారే నిజాయతీగా తీసిన సినిమా అని విశ్లేషకులు అంటున్నారు. అయితే దానితో పోల్చి కాంతారను తక్కువ చేయాల్సిన అవసరం లేదని, కమర్షియల్ అయినా దేశవ్యాప్తంగా భూతకోల కళను పరిచయం చేసినందుకు అభినందించాలని మరికొందరు అంటున్నారు.