బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కి ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఉద్యోగం లేని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులోని మాటను చెప్పుకోలేపోతున్నానని బాధడింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న మీరైనా నా బాధ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నానని కోరింది. పింకీ అనే యువతి పేరుతో ఈ లెటర్ వచ్చింది. అందులో ఏముందంటే.. ‘మీరు ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. కానీ నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను. నాలుగేళ్ల నుంచి ప్రభాత్ అనే వ్యక్తిని వన్ సైడ్ లవ్ చేస్తున్నాను. ఉద్యోగం వచ్చాక ప్రపోజ్ చేద్దామని ఎదురు చూస్తున్నాను. కానీ నోటిఫికేషన్లు రావడం లేదు. వచ్చినా పేపర్ ముందే లీక్ అవుతోంది. దీంతో నాలో సహనం చచ్చిపోతోంది. ఎఫైర్స్ పెట్టుకోవాల్సిన వయసులో కరెంట్ అఫైర్స్ చదువు కోవాల్సి వస్తుంది. ఉద్యోగం రాకపోవడంతో తన తండ్రి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే చాలా నిరాశ కలుగుతోంది’ అని తన బాధను వ్యక్తం చేసింది. ఎంతో ఆశతో ఈ లేఖను రాస్తున్నానని, తనకు ఉద్యోగం వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది. లేకపోతే ప్రేమికుడికి దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. మరి దీనిపై తేజస్వీ యాదవ్ ఎలా స్పందిస్తారో చూడాలి.