సముద్రపు దొంగోడికి  శ్రీకృష్ణుడు ప్రేరణ అంట! - MicTv.in - Telugu News
mictv telugu

సముద్రపు దొంగోడికి  శ్రీకృష్ణుడు ప్రేరణ అంట!

September 29, 2018

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ సిరీస్ చిత్రాల గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. అందులో జాన్ డెప్ పోషించిన జిత్తులమారి జాక్ స్పారో పాత్ర అందరికీ తెగ నచ్చింది. శక్తిసామర్థ్యాలతో కాకుండా వంచన, గజకర్ణగోకర్ణాది టక్కుటమార విద్యలతో శత్రువుల పనిపట్టే జాక్ స్పారో పాత్రకు ప్రేరణ ఎవరో రచయిత చెప్పి పెద్ద బాంబే పేల్చారు.

tt

ఈ పాత్రకు ప్రేరణ హిందువుల దైవమైన శ్రీకృష్ణుడు అని స్క్రీన్ రైటర్లలో ఒకరైన టెడ్ ఇటియట్ తెలిపారు. ‘పాత్రకు రూపకల్పన చేసేటప్పుడు మేం కృష్ణుడిపై ఉన్న వర్ణనలను అధ్యయనం చేశాం. ఆయన లీలలు మాకు బాగా సాయపడ్డాయి.. ’ అని చెప్పారు. కృష్ణుడు కూడా మాయోపాయాలతో శత్రువులు దెబ్బకొట్టడం జాక్ స్పారో కల్పనకు బాగా పనికొచ్చిందని మూవీ కోసం పనిచేసిన మరొకొందరు కూడా అంటున్నారు. అయితే గతంలో వీరు జాక్ స్పారో పాత్రకు కీత్ రిచర్డ్స్(రోలింగ్ స్టోన్స్), పెప్ లే ప్యూ అనే కార్టూన్ పాత్రలు ప్రేరణ అని చెప్పారు. తాజాగా కృష్ణుడే ప్రేరణ అనడంతో సోషల్ మీడియాలో విమర్శలు, జోకులు పేలుతున్నాయి. కృష్ణుడి, జాక్ స్పారోను మిక్స్ చేసిన చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి.