Pista House is setting up the first flight restaurant in Hyderabad
mictv telugu

హైదరాబాదులో తొలి ఫ్లైట్ రెస్టారెంట్.. డిసెంబరులో అందుబాటులోకి

November 25, 2022

Pista House is setting up the first flight restaurant in Hyderabad

ఈ మధ్య హోటల్, రెస్టారెంట్ల యజమానులు కస్టమర్లకు కొత్త అనుభూతి ఇవ్వడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ లో అయితే ఏకంగా యజమాని జైలు రెస్టారెంటును ఏర్పాటు చేశారు. అక్కడ ఊచలు, పోలీసుల కాపలా అన్నీ జైల్లో ఉన్నట్టే ఉంటాయి.

అంతేకాక, వెయిటర్లు ఖైదీల యూనిఫామ్ వేసుకొని వడ్డిస్తారు. ఇలాంటి ఆలోచనే ప్రముఖ రెస్టారెంట్ అయిన పిస్తా హౌస్ ప్లాన్ చేసింది. నగరంలో తొలి ఫ్లైట్ రెస్టారెంటుని ఏర్పాటు చేసింది. డిసెంబరులో ప్రారంభించే ఈ రెస్టారెంటు కోసం ఏకంగా ఓ విమానాన్నే కొనుగోలు చేసింది. నగరవాసులకు వినూత్న అనుభూతి అందించే ఈ రెస్టారెంటును శామీర్ పేటలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పిస్తాహౌస్ రూ. 75 లక్షలు వెచ్చించి కేరళలోని కొచ్చిలో ఎయిర్ బస్ – 320 విమానాన్ని కొనుగోలు చేసింది. హైదరాబాద్ తీసుకురావడానికి మరో 25 లక్షలు పెట్టి లారీ మీద తరలించింది. ఇక రెస్టారెంటుగా మార్చడానికి మరో రూ. 30 నుంచి 40 లక్షలు ఖర్చయింది. ఒకేసారి 150 మంది కలిసి భోజనం చేసే కెపాసిటీతో ఏర్పాటవుతున్న ఈ రెస్టారెంటులో వెళ్లడానికి ఎయిర్ పోర్టు మాదిరి ఎస్కలేటర్లు పెడుతున్నారు. కస్టమర్లు ఎయిర్ పోర్టులో ఉన్న అనుభూతి పొందడం కోసం రన్ వే, బోర్డింగ్ పాస్ లాగా టిక్కెట్లు, సెక్యూరిటీ చెకింగ్ వంటివి ఉంటాయని పిస్తాహౌస్ యాజమాన్యం చెప్తోంది.