పిట్‌బుల్ బీభత్సం.. డాగ్ ఓనర్లు ఆలోచించాలి! - MicTv.in - Telugu News
mictv telugu

పిట్‌బుల్ బీభత్సం.. డాగ్ ఓనర్లు ఆలోచించాలి!

April 2, 2018

కుక్కల్ని ముద్దుగా పెంచుతూ, మూతి నాకితే సరిపోదు. వాటికి పద్ధతీపాడూ నేర్పించాలి. లేకపోతే అవి చేసే అనర్థాలకు అడ్డంగా బుక్కయిపోతారు. ఢిల్లీలో ఓ పిట్ బుల్ జాతికుక్క బీభత్సం సృష్టించింది. పగతోనో, మరే కారణంతోనేగాని చిన్నారులపై దారుణంగా దాడిచేసింది.  మెడపట్టుకుని కొరికేయబోయింది. ఈ దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

 

ఉత్తమ్ నగర్‌లోని ఓ వీధిలో కూర్చుని ఆడుకుంటున్న పిల్లలపై పిట్ బుల్ పరిగెత్తుకుంటూ వచ్చి దాడిచేసింది. ఓ పిల్లాడిని కిందపడేసి కాలును  పట్టుకుంది. స్థానిక మహిళ అడ్డుకుని ఆ బాలుడిని రక్షించడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. మరో మహిళ వచ్చి దుడ్డుకర్రతో బాదినా పిల్లాడిని వదల్లేదు. ఇంకో యువకుడు వచ్చి కుర్చీతో బాదేసరికి పట్టువదిలి పారిపోయింది. కర్చీతోకొట్టిన వ్యక్తిని వెంబడించింది. తర్వాత మళ్లీ వెనక్కి వచ్చింది. ఈ కుక్క ఎవరిదో తెలియడం లేదు. అయితే అది వీధికుక్క మాత్రం కాదని, అలాంటి జాతికుక్కలు వీధుల్లో తిరగవని, ఎవరైనా భరించలేక వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. కుక్కు యజమానులను గుర్తించే పనిలో ఉన్నామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గాయపడిని ముగ్గురు పిల్లలను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.