'అమెజాన్ బిలియన్ డాలర్ల పెట్టుబడి'..అయితే ఏంటి అన్న కేంద్రమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

‘అమెజాన్ బిలియన్ డాలర్ల పెట్టుబడి’..అయితే ఏంటి అన్న కేంద్రమంత్రి

January 16, 2020

nbuifgv

భారత పర్యటనలో ఉన్న ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఒక్కొక్క నేత షాక్ ఇటున్నారు. ఇప్పటికే బెజోస్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించలేదు. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెజాన్ కంపెనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పెట్టుబడిదారులు భారత్‌లోని చట్టాలకు లోబడి వ్యవహరించాలి. భారత్‌లో ఓ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్న అమెజాన్ ఈ దేశానికి ఉపకారం చేసినట్లు అవ్వదు. ఇక్కడ ప్రతిఏటా బిలియన్ డాలర్ల నష్టం వస్తోందని వారు భావించినప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి నిధులు తేక తప్పదు కదా’ అని ఆయన అన్నారు. 

ఇక వస్తువులపై అమెజాన్ ఆఫర్ చేసే భారీ డిస్కౌంట్లపై ఇప్పటికే అనేక దేశాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లో ఈ అంశమై అమెజాన్ విచారణను ఎదుర్కుంటోంది. దీంతో భారత్‌ కూడా అమెజాన్‌పై దృష్టి సారించింది. ఇటీవల చిన్న వ్యాపారుల సంఘం ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ.. అమెజాన్‌పై చేసిన ఫిర్యాదుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా దృష్టి సారించింది. ఓవైపు భారీ డిస్కౌంట్లు ఇస్తూ మరోవైపు కొందరు అమ్మకందారులతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అమెజాన్‌పై దర్యాప్తు ప్రారంభించింది.