Pizza delivery boy, 21, shot at for refusing to accept torn Rs 200 note in Uttar Pradesh
mictv telugu

పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. నోటు చెల్లలేదన్నందుకు..

August 26, 2022

చిరిగిన నోటు చెల్లలేదని, దానికి బదులు మరో రూ.200 నోటు ఇవ్వమన్నందుకు నదీమ్,నయీమ్ అనే ఇద్దరు అన్నదమ్ములు.. పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజన్‌పూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 24 వ తేదీన బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నదీమ్ అనే వ్యక్తి ఫోన్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. రాత్రి 11.30 గంటల సమయంలో పిజ్జా డెలివరీ బాయ్ సచిన్ కశ్యప్.. తన సహచర ఉద్యోగి రితిక్ కుమార్‌తో కలసి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్లారు. పిజ్జా ఇచ్చేసి రూ.200 తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

తమకు ఇచ్చిన రూ.200లతో వారిద్దరూ అక్కడే ఓ షాపులో సాఫ్ట్ డ్రింక్ కొనడానికి వెళ్లారు. అయితే ఆ షాపు యజమాని ఆ నోటు చిరిగిపోయిందని చెప్పడంతో.. వారిద్దరూ వెంటనే వెనక్కి వచ్చారు. నదీమ్‌ను పిలిచి వేరే నోటు ఇవ్వమని అడగ్గా వారిపై సీరియస్ అయ్యాడు. విపరీతంగా తిట్టాడు. అంతలోనే నదీమ్ సోదరుడు నయీమ్ ఓ నాటు తుపాకీతో సచిన్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులు శబ్ధం వినపడగానే.. పొరిగింటి వారు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నదీమ్ ఖాన్ (27), అతని సోదరుడు నయీమ్ (29)ను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి , జైలుకు తరలించారు.