కాంగ్రెస్ పార్టీపై పీకే హాట్ కామెంట్స్..ఘోరంగా ఓడిపోతుంది - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ పార్టీపై పీకే హాట్ కామెంట్స్..ఘోరంగా ఓడిపోతుంది

May 20, 2022

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అని జోస్యం చెప్పారు. పీకే ట్విటర్ వేదికగా స్పందిస్తూ..”రాజస్థాన్‌‌‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవలే జరిగిన కాంగ్రెస్ సమావేశం వల్ల ఒరిగిందేమీ లేదు. యథాతథస్థితిని కొనసాగించడం తప్ప. రానున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుంది. రాజస్థాన్‌లో జరిగిన కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శివిర్‌ ఫలితంపై స్పందించాలని నన్ను చాలా మంది కోరారు. ఈ సమావేశాలు ఏదైనా అర్థవంతమైన దానిని సాధించడంలో విఫలం అయ్యాయి” అని ఆయన రాసుకొచ్చారు.

మరోపక్క పీకే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? కాంగ్రెస్‌లో చేరితే పీకేకు ఏ పదవి ఇస్తారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయిన పీకే.. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు. స్వంతంగా నేనే పార్టీ పెట్టి, ఎన్నికల్లో బీహార్ నుంచి పోటీ చేస్తా’ అని ఆయన స్పష్టం చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో పీకే చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.