పీకే, కేసీఆర్‌ భేటీపై.. రేవంత్ రెడ్డి క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

పీకే, కేసీఆర్‌ భేటీపై.. రేవంత్ రెడ్డి క్లారిటీ

April 25, 2022

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశాంత్ కిశోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ముందు నుంచి చెప్పిందే, ఇప్పుడు నిజమైందని అన్నారు. అంతేకాకుండా గత రెండు రోజులుగా పీకే కేసీఆర్‌ను ఎందుకు కలిశాడో అనే దానిపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..” టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశాడు. ఇక, టీఆర్ఎస్ ఐప్యాణ్ పీకేకు ఎలాంటి సంబంధం ఉండదు.

నేను ముందు నుంచి చెప్పిందే, ఇప్పుడు జరిగింది. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి, నాతో ఉమ్మడి ప్రెస్‌మీట్ పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్‌ను ఓడించండి అని ఆయన నోటి నుంచి చెప్పడం ప్రజలు వింటారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటే ఫైనల్” అని రేవంత్ రెడ్డి అన్నారు.

మరోపక్క తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ సంస్థ టీఆర్ఎస్ కోసమో పనిచేస్తానని ప్రగతిభవన్‌లో రెండు రోజుల భేటీ తర్వాత పీకే తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు. బీజేపీని ఓడించాలంటే ఏకమైతేనే ఆ పార్టీని ఓడించగలమని పీకే సూచించినట్లు తెలిసింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌తో సమదూరం పాటిస్తామని కేసీఆర్ పీకేకు చెప్పినట్లు సమాచారం.