బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరేందుకు నో చెప్పిన పీకే - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరేందుకు నో చెప్పిన పీకే

April 26, 2022

 

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, సర్వేల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సుర్జేవాలా ధృవీకరించారు. 2024లో పార్టీ గెలుపు కోసం చేయాల్సిన పనుల గురించి పీకే ఇటీవల సోనియాగాంధీని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ప్రజెంటేషన్‌పై చర్చించేందుకు పార్టీ ఓ యాక్షన్ కమిటీని నియమించింది. కమిటీలో చేరాలని పీకేను ఆహ్వానించగా, ఆయన నిరాకరించారు. సోనియా గాంధీ కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా.. పీకే చేరనని స్పష్టం చేసినట్టు సుర్జేవాలా వెల్లడించారు. ఇప్పటివరకు ఆయన చేసిన కృషిని, పార్టీ బాగుపడడానికి ఇచ్చిన సూచనల పట్ల ఆయనను అభినందిస్తున్నట్టు తెలిపారు.