జూన్ 1 నుంచి ప్రార్థనా స్థలాలు రీఓపెన్ - Telugu News - Mic tv
mictv telugu

జూన్ 1 నుంచి ప్రార్థనా స్థలాలు రీఓపెన్

May 29, 2020

 

June 1.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగవ దశ లాక్‌డౌన్ ఈ నెల 31తో ముగియనున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలను రీ ఓపెన్ చేయనున్నట్టు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు, సామాజిక దూరం నిబంధనలతో ప్రార్థనా స్థలాలు తెరుచుకునేందుకు అనుమతించాలంటూ ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ రాశారు.

దీంతో ప్రార్థనా స్థలాలు రీఓపెన్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలువనుంది. అలాగే జూన్ 8 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నీ 100 శాతం పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. జూన్ 1 నుంచి మరో 15 రోజుల పాటు లాక్‌డౌన్ 5 అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో మమత సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.