అనుష్క సోదరుడి హత్యకు ప్లాన్.. అతడేం తక్కువ కాదు! - Telugu News - Mic tv
mictv telugu

అనుష్క సోదరుడి హత్యకు ప్లాన్.. అతడేం తక్కువ కాదు!

June 13, 2022

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ హత్యకు భారీ కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఓ గ్యాంగ్ స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్య ప్లాన్‌కు దారి తీసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.

అనుష్క శెట్టి సోదరుడు గతంలో మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్ప రై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్ శెట్టిలు కుడి, ఎడమ భుజంగా ఉండి విధులు నిర్వహించేవారు. ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అయితే, గుణరంజన్ శెట్టి హత్యకు మన్విత్ రై స్కెచ్ వేసినట్టు గతకొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తూ, ముందుకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఆయనను హత్య చేసేందుకు మన్విత్ రై కుట్ర పన్నినట్టు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే హత్య చేయడానికి దారితీసిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన గుణరంజన్ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి తనకు భద్రత కల్పించాలని కోరారు.

మరోపక్క అనుష్క శెట్టి టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ పరిశ్రమల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకెళ్తోంది. అనుష్కకు ఇద్దరు సోదరులు ఒకరు గుణరంజన్ శెట్టి, మరోకరు రమేశ్ శెట్టి. కొన్ని రోజులుగా అనుష్క సోదరుడి హత్యకు స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తుండడంతో అటు అనుష్క ఫ్యామీలీలో, ఇటు ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.