2 హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం.. ముగ్గురి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

2 హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం.. ముగ్గురి మృతి

April 15, 2019

విమానాలు గాలిలోనే కాదు, నేలపైనా ప్రమాదాలకు గురవుతున్నాయి.  నేపాల్‌లో ఓ విమానం.. రెండు హెలికాప్టర్లను ఢీకొట్డంతో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లుక్లాలోని తెన్‌జింగ్‌ హిల్లరీ విమానాశ్రయం నుంచి సమ్మిట్ ఎయిర్‌కు చెందిన ఒక చిన్న విమానం  కఠ్మాండుకు వెళ్లడానికి టేకాఫ్‌ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

Plane collide with two helicopters Nepal plane crash leaves three dead at one of world's most dangerous airports in Lukla airport.

విమానం.. ప్రమాదవశాత్తూ రన్‌వే నుంచి దారి తప్పి హెలిప్యాడ్‌లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ప్రమాదంలో హెలిప్యాడ్ వద్ద ఉన్న ఎస్స్, కోపైలట్‌  అక్కడిక్కడే మృతి చెందగా.. మరొక  ఏఎస్సైని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. ఒక హెలికాప్టర్ లోని వ్యక్తి గాయపడ్డాడు. విమానంలోని పైలట్‌కూ గాయాలయ్యాయి.  అత్యంత ప్రమాదకరంగా పేరుగాంచిన ఈ ఎయిర్‌పోర్టుకు వేసవిలో సందర్శకుల తాడికి ఎక్కువ  ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన ఖొమొలుంగామాను చూడ్డానికి పర్యాటకులు హెలికాప్టర్లలో వస్తుంటారు.